‘అ!’ సినిమాలో వాడిన మోర్స్ కోడ్ ..గురించి తెలుసుకోవాలని ఉందా?

updated: February 23, 2018 10:28 IST
‘అ!’ సినిమాలో వాడిన మోర్స్ కోడ్ ..గురించి తెలుసుకోవాలని ఉందా?

నేచురల్ స్టార్ నాని తొలిసారిగా నిర్మాతగా మారి వాల్ పోస్టర్ బ్యానర్‌లో నిర్మించిన ‘అ!’ సినిమా మంచి కలెక్షన్స్ తో భాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అన్ని సినిమాలయందు ‘అ!’ సినిమా వేరయా అంటూ ప్రచారంలో వినూత్న శైలిచూపించిన ఈ చిత్రంలో కొన్ని ఎలిమెంట్స్ సైతం జనాలని ఆశ్చర్యపరిచాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో మోర్స్ కోడ్ కు చెందిన కొన్ని ఎలిమెంట్స్ ని దర్శకుడు పెట్టడం జరిగింది. ఓ పర్షియన్ గెస్ట్ తో అవసరాల శ్రీనివాస్ పాత్ర మోర్స్ కోడ్ ని డీ కోడ్ చేస్తూ మాట్లాడతాడు. ఈ సీన్ చూసిన చాలా మందికి అసలు మోర్స్ కోడ్ ఏమటి అనే సందేహం కలిగటం సహజం.

వాస్తవానికి మోడ్స్  ఓ విధమైన కమ్యూనికేషన్ సిస్టమ్. దాన్ని శ్యాముల్ ఎఫ్.బి. మోర్స్ అనే ఆయన డవలప్ చేసారు. వరస  డాట్స్ ,డాష్ ల ద్వారా మెసేజ్ లు పంపటం జరుగుతూంటుంది. ఈ విధానాన్ని టెలీగ్రాఫ్ డిపార్టమెంట్ వారు టెలిగ్రామ్ లు అందుకోవటం,పంపంటం కోసం వాడేవారు.  దీని కోసం ప్రత్యేకమైన ట్రైనింగ్ సైతం ఇచ్చేవారు. ఆ ట్రైనింగ్ లో పాసైన వారికే ఉద్యోగాలు ఇచ్చేవారు. అయితే కాల క్రమంలో  టెలీకమ్ లైన్స్ రావటం దాని ద్వారా కంప్యూటర్స్ సాయింతో టెలీగ్రామ్ లు పంపంటం జరిగింది. 

అయితే ఇప్పటికీ ఏదైనా ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు , ఎమర్జన్సీ సిట్యువేషన్ లో పవర్, టెలికమ్ లైన్స్, ఇంటర్నెట్, సెల్ ఫోన్ వంటి ఆధునిక పరికరాలు కు చెందిన వ్యవస్దలు సైతం కొలాప్స్ అయినప్పుడు ఈ విధానం ద్వారా మేసేజ్ లు పంపుతూ సహాయిక చర్యలు చేపట్టడం జరుగుతుంది. నిజానికి మోర్స్ కోడ్ అనేది నేర్చుకోవటం అంత కష్టమేమి కాదు. కాస్త దృష్టి పెట్టాలంతే. ఒక సారి కనుక మోర్స్ కోడ్ నేర్చుకుంటే బేసిక్ సిగ్నల్స్ ఇవ్వటం తెలిస్తే, మెసేజ్ లు పంపటం, వచ్చిన మెసేజ్ లు తిరిగి ట్రాన్సలేట్ చేయటం చేయచ్చు. మరి మీకు ఇంట్రస్ట్ ఉంటే మోర్స్ కోడ్ నేర్చుకోవటం మొదలెట్టండి. యూ ట్యూబ్ లో అందుకు సంభందించిన వీడియోలు సైతం ఉన్నాయి.

  

Disclaimer: The following shared video may not be part of Telugu100.com network. Sometimes we may give external links to strengthen the quality of the posts. In this case, Telugu100.com is not responsible for the content of the videos and the original owner would be responsible for the same.

Tags: awe cinema, morse code

comments